Mandapeta: రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శగా వేగుళ్ల పట్టాభి రామయ్య

మండపేట (CLiC2NEWS): ఆంధ్రపదేశ్ లో రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించడానికి కృషిచేస్తానని ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన రైస్ మిల్లర్స్ సమావేశంలో ఏర్పాటైన రాష్ట్ర కార్యవర్గంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పట్టాభి పదవిని అలంకరించడం పట్ల ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ యూనియన్ , వైసీపీ నాయకులు హర్షం ప్రకటించారు. కేపీ రోడ్డులో ఉన్న ఆయన కార్యాలయానికి రైస్ మిల్లర్స్, వైసీపీ నాయకులు చేరుకుని ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ యాజమాన్యం మార్ని కోటేశ్వరరావు(కోటిబాబు), సతీష్, మెహెర్, వేగుళ్ల నారయ్య చౌదరి, వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అధికారి శ్రీనివాస్, శెట్టిబలిజ సంఘం పట్టణ అధ్యక్షుడు పెంకే గంగాధర్, పులగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.