తోట త్రిమూర్తులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సేవా కార్యక్రమాలు..
మండపేట (CLiC2NEWS) : శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు వెంకటాయపాలెం హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా ప్రజల ముందుకు రావాలని అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యంతో మండపేటలో అడుగు పెట్టాలని కాంక్షిస్తూ ఏడో వార్డు వైసీపీ ఇన్ మందపల్లి రుద్రకాంత్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు . తోట త్రిమూర్తులు తొందరగా తేరుకొని ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్లు ఆస్మా అఖ్తర్ , రాము చేతులు మీదుగా రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్, పళ్ళబండి సూరిబాబు, సుందరపు సత్తిబాబు, అయినవిల్లి రమణ, మందపల్లి సుధాకర్, కొడమంచిలి భాస్కరరావు, పెందుర్తి శ్రీను , మందపల్లి సంజీవరావు ,యార్లగడ్డ పృధ్వీరాజ్ ,లంక సాయి, మందపల్లి సతీష్, పెందుర్తి సూరిబాబు,మందపల్లి భాస్కరరావు, జతక పెద్ద, తదితరులు పాల్గొన్నారు.