ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్ సోకి వారం రోజుల్లో ఆరు అవులు మృతి

మండపేట (CLiC2NEWS):  ద్వారపూడిలో పశువులు ప్రాణాంతక వైరస్ బారిన పుడ‌తున్నాయి. దీంతో గ‌త ఏడు రోజుల్లో ఆరు ఆవులు మృతి చెందాయి. ఆవుల‌ను ప‌రీశీలించిన రైతులు లుంపి ల‌క్ష‌ణాలు క‌లిగి ప‌శువులు స‌కాలంలో వైద్యం అందుబాటులో లేక‌ చ‌నిపోతున్నాయ‌ని అంటున్నారు. దీంతో రైతులు అందోళ‌న చెందుతున్నారు.
పాడిరైతులు ఈ వ్యాధి కోసం సర్పంచ్ ఈతకోట కిన్నెర, ఉప సర్పంచ్ తులా శేషారావు, సొసైటీ చైర్మన్ దంతులూరి శ్రీరామవర్మ దృష్టికి తీసుకెళ్లగా వారు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను వివరించారు. వ్యాధి సోకిన పశువులు మేత, నీళ్లు తీసుకోవడం లేదని తెలిపారు. తర్వాత నడవలేని స్థితిలోకి వెళ్లి చనిపోతున్నాయని వివరించారు. గ్రామంలోని చాలా ఆవులకు ఈ వైరస్ సోకుతున్నట్టు చెప్పారు. గతంలో వచ్చిన లుంపీ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని అక్కడి రైతులు పేర్కొంటున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ద్వారపూడిలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేసి పశువులకు మెరుగైన వైద్యం అందించి పశువులను రక్షించాలని కోరుతున్నారు. అదే విధంగా ఇక్కడ శాశ్వతంగా పశు వైద్యాధికారిని కూడా నియమించాలని కోరుతున్నారు.

2 Comments
  1. zoritoler imol says

    I’m truly enjoying the design and layout of your website. It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come here and visit more often. Did you hire out a designer to create your theme? Outstanding work!

  2. gate io says

    I may need your help. I tried many ways but couldn’t solve it, but after reading your article, I think you have a way to help me. I’m looking forward for your reply. Thanks.

Leave A Reply

Your email address will not be published.