ప్ర‌శ్నాప‌త్రం లీకేజి కేసు: మ‌రికొన్ని ప్ర‌శ్నాప‌త్రాలు స్వాధీనం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌శ్నాప‌త్రం లీకేజి కేసులో సిట్ అధికారులు నిందితుల ఇళ్ల‌లో‌లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల స‌మ‌యంలో మ‌ణికొండ‌లోని రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇంట్లో మ‌రికొన్ని ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగో రోజు విచార‌ణ‌లో సిట్ అధికారులు ప‌లు కీల‌క ఆధారాలు సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. మార్చి 5వ తేదీన నీలేష్‌, గోపాల్ అసిస్టెంట్ ఇంజినీర్ ప‌రీక్ష రాసేందుకు పేప‌ర్ ఇచ్చినందుకు ఇద్ద‌రు అభ్య‌ర్థులు కానిస్టేబుల్ శ్రీ‌నివాస్ ద్వారా రూ.14 ల‌క్షలు స‌మ‌కూర్చిన‌ట్లు స‌మాచారం. ఈ కేసులో మ‌రో నిందితురాలు రేణుక‌తోపాటు ఆరుగురిని హిమ‌య‌త్ న‌గ‌ర్‌లోని సిట్ కార్యాల‌యానికి తీసుకొచ్చి విచారించారు.

1 Comment
  1. […] ప్ర‌శ్నాప‌త్రం లీకేజి కేసు: మ‌రికొన్… […]

Leave A Reply

Your email address will not be published.