సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ తూ.గో. జిల్లా కన్వీనర్ గా బాబ్జి నియామ‌కం

మండపేట: మండలంలోని ద్వారపూడి గ్రామానికి చెందిన అడబాల బాబ్జికి సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ లో స్థానం లభించింది. సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ గా బాబ్జి నియమితులయ్యారు. ఈ మేరకు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాసరావు మంగళవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఒకప్రకటనలో వేల్పూరి శ్రీనివాస్ మాట్లాడారు. అందరికి సామాజిక న్యాయం, ఆర్ధిక న్యాయం, రాజకీయ న్యాయం సాధించడం, రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం, అవినీతిని అంతం చేయటం వంటి అంశాలు తమ అసోసియేషన్ సిద్ధాంతమన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం కాపు, తెలగ,బలిజ, ఒంటరి, తూర్పుకాపు కులస్తులు అంతా పెద్దన్న పాత్ర వహించి నిరంతరం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన బాబ్జి మాట్లాడుతూ తనపై సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటానని అన్నారు. కాపుల్లో ఉన్న అన్ని తెగలను ఏకం చేసి సమిష్టి కృషితో సంఘం అభ్యున్నతికి పాటు పడతానని తెలిపారు. తనకీ పదవి రావడానికి కృషి చేసిన వేల్పూరి శ్రీనివాస్ కు బాబ్జి కృతజ్ఞతలు తెలిపారు. కాపు అసోసియేషన్ జిల్లా కన్వీనర్ గా పదవి చేపట్టిన బాబ్జి నియామకం పట్ల నియోజక వర్గంలో కాపు ప్రముఖులు తమ హర్షం ప్రకటించారు. నియోజక వర్గంలో నాయకులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.