శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు 1,11,111 కిలోల లడ్డూలు
మీర్జాపూర్ (CLiC2NEWS): అయోధ్య రామ మందిరంలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య రామ మందిరం నిర్మాణ తర్వాత మొదటిసారిగా జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు భారీ సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తున్నారు. రాములవారి ప్రసాదంగా భక్తులకు పంచేందుకు ఏకంకా 1,11,111 కిలోల లడ్డూలను పంపిచనున్నట్లు దేవ్రహ హాన్స్ బాబా ట్రస్టు వెల్లడించింది. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రోజున కూడా ఆ ట్రస్టు నుండి 40 వేల కిలోల లడ్డూ ప్రసాదం పంపారు. కాశీ విశ్వానాథ్ లేదా తిరుపతి వేంకటేశ్వరస్వామి వంటి ఆలయాలకు ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతామని ట్రస్టీ అతుల్ కుమార్ సక్సనా వెల్డించారు.