రాజకీయాలపైన ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశలోనే నేర్చుకోవాలి: ఎఐఎస్ఎఫ్
AISF: విద్యార్థులు చదువుతోపాటు రాజకీయాలపైన ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశలోనే నేర్చుకోవాలని ఎఐఎస్ఎఫ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను కాకినాడలో జులై 8,9,10 తేదీలలో జరగనున్నాయి. ఈ సందర్బంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక , రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను శనివారం విడుదల చేశారు.
కేవలం చదువే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యావ్వవస్థలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికి , అక్రమాల పైన పోరాటాలు చేయడానికి ఈ శిక్షణా తరగతులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందిన ఎఐఎస్ ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ విజేంద్ర పేర్కొన్నారు.