`అమ్మఒడి`ని కొనసాగించాలంటే విద్యార్థుల హాజరు తప్పనిసరి

మండపేట (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు తెలుగు ఒకేసారి విద్యా బోధన చేయడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి వెల్లడించారు. బుధవారం పట్టణ పరిధిలో 22 వ వార్డు 30 వార్డుల్లో జగనన్న విద్యా కానుకలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల్లో ఒకవైపు ఇంగ్లీషు మరోవైపు తెలుగు ఉండే విధంగా జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. ఈ విధమైన ద్విభాషా విద్యావిధానం వల్ల బాలబాలికలకు బాల్యం నుండి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తుందని, వారు భవిష్యత్తులో మరింత ప్రతిభావంతంగా రాణించగలుగుతారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా కానుక కిట్లు అందజేశారు. అమ్మ ఒడి పథకాన్ని కొనసాగించడానికి విద్యార్థుల తల్లిదండ్రులే చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో హాజరు శాతం సంతృప్తికరంగా ఉంటేనే అమ్మ ఒడి పథకం అమలవుతుందన్నారు. ఈపథకం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం సంపూర్ణమైన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ఆశయం ఉన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుందన్నారు. ఆంగ్ల మాధ్యమాల్లో బోధన వల్ల తమ ప్రతిభాపాటవాలు మెరుగుపరచుకోవచ్చు అన్నారు. తల్లిదండ్రులు త‌మ‌ పిల్లలు ఏ విధంగా చదువుతున్నది సాయంకాలం ఒక గంట సేపు పరిశీలించాలన్నారు. ప్రతిరోజు వారిని విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు మారిశెట్టి సత్యనారాయణ, బొక్కా సరస్వతి, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, పాఠశాల సూపర్‌వైజర్ అప్పారావు, పాఠశాల సిబ్బంది, హెడ్ ​​మాస్టర్ పివివి సత్య నారాయణ రాజు, పేరెంట్స్ కమిటి చైర్మన్ లు మారిశెట్టి వరలక్ష్మి, ఆర్ జ్యోతి వైఎస్సార్ కార్యకర్తలు పాల్గొన్నారు.

1 Comment
  1. Earn Online says

    Wow, incredible weblog format! How long have you ever been blogging for? you make running a blog look easy. The total look of your website is magnificent, as smartly as the content material!!

Leave A Reply

Your email address will not be published.