గిరిదేవతలారా మీకు దండం..

గిరిదేవతలారా మీకు దండం
మాటకు కట్టుబడే తత్వం
కల్లా కపటం ఎరుగని నా గిరిజనం
చదువు సంధ్యకు దూరం
ప్రకృతి అంటే మమకారం
క్రూర జంతువులతో సహవాసం
ఏమీ ఎరుగని వనజీవులు
వారికి తోడూ నీడగా గిరిదేవతలు
ధర్మంకోసం, జాతి కోసం
రాజులనే ఎదిరించిన గిరిపుత్రికలు
వెన్నుపోటును సైతం లెక్కచేయక
పోరాటం చేసి దీనులకు దేవతగా నిలిచిన వైనం
సమ్మక్క,సారక్కల గద్దెలే దీవనలిచ్చు
నిలువెత్తు బంగారంతో మొక్కులు తీర్చు
సమ్మక్క,సారక్కల నామస్మరణ
కోడికూతతో గిరిజనానికి నిత్యస్మరణ
కట్టు బాటుదాటని జీవనవైవిద్యం
రెండేళ్లకోసారిజరిగే జాతరమహత్యం
ప్రతీ చెట్టూ, పుట్టా మీకిచ్చునుఆతిథ్యం
పున్నమి కాంతులే జిలుగు వెలుగులు
భక్తితో వెలిగించే దీవిటీలు
ఆ దేవతలకు సమర్పించే నీరాజనాలు
జంపన్న వాగులో పుణ్యస్నానాలు
పాప పరిహారానికి మోక్షమార్గాలు
చెట్టుపై వాలిన పిట్ట…
ప్రకృతి సిద్దిమైన మత్తుపానీయం
దేవతలకు ఇష్టనైవేద్యం
పిల్లా, పాపాలతో
గిరిజన బంధు గణం ఖుషీ ఖుషీ
ఓ నవసమాజమా
ఇదీ గిరిజన కుంభమేళా
ధ్వంసం చేయెద్దు వారి సంస్కృతి
-ఎస్.వి.రమణా చారి
సీనియర్ జర్నలిస్ట్
9 8 4 9 8 8 7 0 8 6