శరీరాన్ని సంతులితం చేసే త‌డాస‌నం

త‌డాస‌నం చేయువిధానం

చక్కగా నిలబడి రెండు చేతులు వ్రేళ్లను పరస్పరం కలిపి తలపై ఉంచుము. కింద పాదాలని కలిపి ఉంచవలెను.
శ్వాసను లోపలకు నింపుకొనుచు పైకి లేపి నిటారుగా నుంచుము. మరియు చీల మండలంను కలిపి లేపుము శ్వాసను వదులుచూ క్రిందికి రావలెను చేతులను తలపై నుంచవలెను ఈ ప్రకారము ఐదుసార్లు చేయవలెను.

ప్రయోజనాలు…
శరీరాన్ని సంతులితం చేస్తుంది.
పిల్లలు హైట్ (ఎత్తు)పెరగటానికి చక్కగా ఉపయోగపడుతుంది.మడమలకు,మోకాళ్ళకి,నడుముకి, మెడకు మంచి రిలాక్స్ దొరుకుతుంది. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకగ్రాతను పెంచుతుంది.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: శిథిలీకరణ వ్యాయమముతో మోకాళ్ల నొప్పుల‌కు చెక్‌

Leave A Reply

Your email address will not be published.