త‌మిళ‌నాడు రాష్ట్ర గీతం.. ప్ర‌క‌టించిన సిఎం స్టాలిన్‌

చెన్నై(CLiC2NEWS): త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం ‘త‌మిళ్ థాయ్ వాళ్తూ’ అను గీతంను రాష్ట్ర గీతంగా శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ రాష్ట్ర గీతాన్ని విద్యా సంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో త‌ప్పనిస‌రి చేయాల‌ని ఆదేశించింది. రాష్ట్ర గీతం ఆల‌పించేట‌పుడు వివ్యాంగులు త‌ప్ప మిగ‌తా వారంతా లేచి నిల‌బ‌డాల్సిందేన‌ని ఆదేశాలు జారీచేసింది. విద్యావేత్త మ‌నోన్మ‌ణియం సుంద‌ర‌నార్ ఈ గీతాన్ని ర‌చించారు. దీనికి ఎం.ఎస్‌.విశ్వ‌నాథ‌న్ సంగీత‌మందించారు. ఈ గీతం నిడివి 55 సెక‌న్లు ఉంటుంది.

ఇటీవ‌ల కేవ‌లం ఓపాట మ‌త్ర‌మేన‌ని, ఏ కార్య‌క్ర‌మంలోనూ ఎవ‌రూ లేచి నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌ద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సంవ‌త్స‌రం ఐఐటి-మ‌ద్రాస్ స్నాత‌కోత్సవంలో ఆపాట‌ను ప్లే చేయ‌లేదు. అప్ప‌టినుండి ఈ విష‌యంపై చ‌ర్చ‌మొద‌లైంది. ఈ విష‌యంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇనిస్టిట్యూట్ డైరెక్ట‌ర్‌కి లేఖ వ్రాశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ‘రాష్ట్రగీతంగా’ ప్ర‌క‌టించింది.

 

Leave A Reply

Your email address will not be published.