ద‌శ‌ల‌వారీగా రాష్ట్రవ్యాప్తంగా ద‌ళిలబంధు: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ భ‌వన్‌లో శుక్ర‌వారం సిఎం కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న టిఆర్ ఎస్ పార్టీ వ‌స్తృత స్థాయి స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి టిఆర్ ఎస్‌ ప్ర‌జా ప్ర‌తినిధులు, నేతలు, కొత్త‌గా నియ‌మితులైన కార్పొరేష‌న్ స‌భ్యులు హాజ‌రైనారు. ఈ స‌మావేశంలో ధాన్యం కొనుగోళ్లు, గ‌నుల ప్రైవేటీక‌ర‌ణ గురించి ప్ర‌ధానంగా చ‌ర్చించారు. సిఎం కెసిఆర్ భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై నేత‌ల‌కు సిఎం దిశానిర్దేశం చేశారు. రైతుబంధు ప‌థ‌కం య‌థావిధిగా కొన‌సాగుతుంద‌ని సిఎం స్ప‌ష్టం చేశారు. ద‌ళిత‌బంధుపై విప‌క్షాలు అన‌వ‌స‌ర‌మైన రాద్దాంతం చేస్తున్నాయ‌ని, అటువంటి దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని కెసిఆర్ పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ద‌శ‌ల‌వారీగా రాష్ట్రమంతా అమ‌లు చేస్తామ‌ని వెల్ల‌డించారు. స‌మావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సిలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు స‌మితి రాష్ట్ర, జిల్లా అధ్య‌క్ష‌లు, పార్టి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, రాష్ట్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్లు హాజ‌రైనారు.

Leave A Reply

Your email address will not be published.