రేపు తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల 13న నిర్వహించిన తెలంగాణ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదలకు రంగం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు పాలిసెట్-2025 ఎక్జామ్ నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని సాంకేతికవిద్యాభవన్ లో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ కార్యదర్శి బి.శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.