మండపేటను రాజమహేంద్రవరంలో విలీనం చేయలంటూ సాగుతున్న రిలే నిరాహారదీక్షలు..
మండపేట (CLiC2NEWS): రాజమహేంద్రవరం జిల్లాలో మండపేటను విలీనం చేయాలంటూ మండపేటలో ప్రారంభించిన నిరవధిక రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అఖిల పక్షం నాయకులు ఏర్పాటు చేసిన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలు శనివారం నాటికి 5 వ రోజుకు చేరాయి. మండపేట నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం చేపట్టిన దీక్షలకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కుల సంఘాల వారీగా తమ మద్దతు తెలియజేయడానికి ఒక్కో రోజు దీక్షల్లో కూర్చోడానికి సమయం కేటాయిస్తున్నారు. శనివారం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణలు చేతుల మీదుగా నేడు దీక్షలు ఆరంభమయ్యాయి. నిరసన కారులకు పూల మాలలు వేసి దీక్షలు ప్రారంభింప జేసారు. జనసేన పార్టీ మండల కన్వీనర్ కుంచే ప్రసాద్ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ దీక్షల్లో మండల విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు పట్నాల శ్రీనివాస్, వడ్రంగి పనివారల సంఘం అధ్యక్షుడు కోటిపల్లి కృష్ణమాచార్యులు, మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు విన్నకోట రాధా కృష్ణ ప్రసాద్, విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి దార్ల నాగ సుబ్రహ్మణ్యం, నాయకులు కింతాడ హేమ శ్రీనివాస్, మండల విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఒంపోలు పోలరాజు, కొమ్మోజు నాగ వెంకట బుల్లబ్బాయి, రామోజీ కృష్ణ, మండల విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు పి సత్యనారాయణ పాల్గొన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో జెసి ప్రసాద్ వేముల శ్రీరామమూర్తి, గొడవర్తి రామచంద్రరావు, మోరంపూడి సుబ్రహ్మణ్యం, నెల్లిపూడి సత్యనారాయణ, తణుకు జయ చంద్రప్రసాద్, గాలింకి నాగేశ్వరరావు, వెదురుపర్తి నారాయణ, నరిగిరి కృష్ణ, చెల్లూరి కుమార స్వామి ఉన్నారు.