AP: రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వేగుళ్ళ
మండపేట (CLiC2NEWS): వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిచాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మండపేట ఎమ్మెల్యే , రాష్ట్ర అంచనాల కమిటి ఛైర్మన్ వేగుళ్ల జోగోశ్వర రావు మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినాయకచవితి పండుగను ప్రజలంతా ఘనంగా, ఆనందంగా జరుపోకోవాలన్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్.టి.జి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నట్టు వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
[…] […]