హైదరాబాద్లో గోడకూలి ముగ్గురు మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని కెపిహెచ్బి పిఎస్ పరధిలో నిర్మాణంలో భవనం యొక్క గోడ కూలి ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవ శాత్తు గోడకూలి సంతు, సోనియా, సానియా మృతి చెందారు. వీరంతా రెండు నెలల క్రితం ఒడిశా నుండి హైదరాబాద్కు వచ్చి పనులు చేసుకుంటున్నారు. 10 రోజుల కిందట భవనం ఆరో అంతస్తులో గోడపై ఎలివేషన్ నిర్మించే క్రమంలో వేసిన స్లాబ్ కూలి ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, డిఎస్పి శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.