కూతురు అంటే ..

కూతురు అంటే కూడికలు తీసివేతలు కాదు..

మన వాకిట్లో వెలసిల్లిన తులసి మొక్క.

కూతురు అంటే దించేసుకునే బరువు కాదు.. ఇంటిలో వెలసిన కల్పతరువు.

కూతురు అంటే భద్రముగా చూడవలసిన గాజుబొమ్మ కాదు.. కడుపున పుట్టిన మరో అమ్మ.

కూతురు అంటే కష్టాలకు కన్నీళ్లకు చిరునామా కాదు ..కల్మషము లేని ప్రేమకు చిహాహ్నము.

కూతురు కళ్యాణము అయినా చెంతకు పరిగెత్తుకు వస్తుంది తల్లిదండ్రులకు ఏ కష్టము వచ్చినా ..

కూతురు వివాహము అయిన తరువాత ఇంటి పేరు మారిన..

ఎన్నటికీ ఎప్పటికి పుట్టింటిపైనా వదులుకోరు మమకారము.

కూతురు కొడుకు లాగా కాటి వరకూ తోడూ రాకపోయినా.. ప్రసాదించగలదు మరో జన్మ తల్లిదండ్రులకు.

కూతురు ఉన్న ఏ ఇల్లు అయినా అవుతుంది దేవతల కోవేల.

కూతురుని కన్న ఎ తండ్రి అయినా గర్వపడాలి యువరాణిని కన్నా మహరాజులా..

-గంగ‌వ‌ర‌పు సీతారామ్‌
న్యాయ‌వాది

Leave A Reply

Your email address will not be published.