పశ్చిమ బెంగాల్‌లో అమానవీయ ఘటన..

కోలకతా (CLiC2NEWS): బెంగాల్లో అమానవీవ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులను ఓ వ్యక్తి కర్రలతో పశువులను కొట్టినట్లు కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చుట్టూ గుమిగూడిన జనం వింత చూస్తున్నారు కానీ.. ఆపే ప్రయత్నం చేయటంలేదు. ఈ ఘటన నార్త్ బెంగాల్‌లోని ఉత్తర్ దీనాజ్‌పుర్ జిల్లాలలోని చోప్రా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇదంతా జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న?. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి అనుచరుడైనట్లు సమాచారం . దీనిపై బిజెపి, సిపిఎం పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బెంగాల్‌లో శాంతిభద్రతలు కొరవడ్డాయని, ఇలాంటి రాక్షసులపై సిఎం చర్యలు తీసుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.