కాంగ్రెస్ వ‌ల్లే తెలంగాణ‌- ఎపికి న‌ష్టం: ప్ర‌ధాని మోడీ

న్యూడిల్లీ (CLiC2NEWS):ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న తీరుతో ఎపి-తెలంగాణ రాష్ట్రాలు ఇప్ప‌టికీ న‌ష్ట‌పోతున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. రాజ్య‌స‌భ‌లో రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్యావాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీరుపై విరుచుకుప‌డ్డారు. ఇవాళ (మంగ‌ళ‌వారం) కాంగ్రెస్ పార్టీని ప్ర‌ధాని స‌భ‌లో నిల‌దీశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ప్ర‌ధాని ఆరోపించారు. మైక్ లు బంద్ చేసి.. పెప్ప‌ర్ స్ప్రే చేసి.. చ‌ర్చ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌క‌టించారిని ఆరోపించారు. ఇంత గంద‌ర‌గోళం సృష్టించ‌డానికి కాంగ్రెస్ పార్టీ అహంకార‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌ధాని మోడీ ఆరోపించారు.

“తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మేం వ్య‌తిరేకం కాదు.. వాజ్‌పేయీ స‌ర్కార్ మూడు రాష్ట్రాల‌ను శాంతియుతంగా ఏర్పాటు చేసింది. ఏపీ విష‌యంలో అలా జ‌రుగ‌లేదు. కాంగ్రెస్ అధికార కాంక్ష‌కు ఇది నిద‌ర్శ‌నం. ఎపి , తెలంగాణ విభ‌జ‌న స‌రిగా జ‌రిగి ఉంటే ఆ రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేవి కావు“ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్ర‌ధాని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.