తెలంగాణ‌లో క‌రోనా మూడో ద‌శ ముగిసిపోయిన‌ట్లే: డిహెచ్ శ్రీ‌నివాస‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి మూడో ద‌శ ముగిసింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీ‌నివాస రావు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై ఇవాళ (మంగ‌ళ‌వారం) ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

జ‌న‌వ‌రి 23న మూడో ద‌శ ఉధృతి పెరిగింద‌ని చెప్పారు. పాటిటివిటి రేటు అత్య‌ధికంగా 5 శాతానికి వెళ్లింద‌ని.. ప్ర‌స్తుతం రెండు శాతం కంటే త‌క్కువ‌గా ఉంద‌ని ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రంలో జ‌న‌వ‌రి 28న క‌రోనా మూడోద‌శ ఉధృతి ముగిసింద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్ష‌లు లేవ‌ని తెలిపారు.

కొవిడ్ వ‌ల్ల గ‌త రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. కొవిడ్ ఆంక్ష‌లు లేనందు వ‌ల్ల అన్ని సంస్థ‌లు 100 శాతం ప‌ని చెయొచ్చు. ఉద్యోగు పూర్తి సంఖ్య‌లో కార్యాల‌యాల‌కు వెళ్లొచ్చు. ఐటి కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం తీసివేయ‌వ‌చ్చు అని తెలిపారు. అలాగే విద్యాసంస్థ‌లను పూర్తిగా ప్రారంభించాం. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌తో పిల్ల‌ల్లో మాన‌సిక స‌మ‌స్య‌లు రావ‌చ్చొన్నారు. కాగా క‌రోనా కేసులు త‌గ్గినా మాస్కులు ధ‌రించాల‌ని డాక్ట‌ర్ శ్రీ‌నివాస్ రావు ఆదేశించారు.

 

Leave A Reply

Your email address will not be published.