తెలంగాణలో కరోనా కేసుల ఎన్నంటే..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 61,573 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తాగా 865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒకరు కరోనాతో మృతి చెందారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,103కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజులో కరోనా బారినుండి 2,484 మంది బాదితులు కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 19,850 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిహెచ్ ఎమ్‌సి పరిధిలో కొత్తగా 263 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.