ములుగు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం

ములుగు (CLiC2NEWS): జిల్లా కేంద్రంలోని జాకారం జాతీయ ర‌హ‌దారిపై బుధ‌వారం కారు చెట్ట‌ను ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. కారులో ప్ర‌యాణిస్తున్న మ‌రో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయప‌డిన వారిని వ‌రంగ‌ల్ ఎమ్‌జిఎమ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కారులో ప్ర‌యాణిస్తున్న వారంద‌రూ స‌మ్మ‌క్క-సార‌లమ్మ‌ను ద‌ర్శించుకుని వెళ్తున్నట్లు స‌మాచారం. ప్ర‌యాణికులంద‌రూ ఖ‌మ్మం జిల్లా పాండురంగాపురంకు చెందిన‌వారుగా గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.