విఎస్‌యూలో పరీక్ష నియంత్రణ అధికారిగా డా ఆర్.ప్రభాకర్ నియామకం.,
నెల్లూరు (CLiC2NEWS): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగ అధిపతి డాక్టర్ ఆర్. ప్రభాకర్ గారు నేడు పరిక్షల నియంత్రణ అధికారిగా భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ముందుగా ఉపకులపతి ఆచార్య జి.యం. సుందరవల్లి గారికి, డైరెక్టర్ ఆచార్య ఎం.చంద్రయ్య గారికి మరియు రిజిస్ట్రార్ డా ఎల్.విజయ కృష్ణ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ నా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము కాకుండా కృషి చేస్తాను అని, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అతి కీలకమైన విభాగం Examination అని తెలిపారు. ప్రతిఒక్కరు వారి సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా Examination లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కలిసి కట్టుగా ఉండి విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని తెలియచేసారు. మునుపు ఉన్న Controller of Examination డా సీ ఎస్.సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఎన్నో కష్టనష్టాలు ఒడిదుడుకులు ఎదురుకొని Examination ని చాలా చక్కగా ఏర్పాటు చేశారు అని తెలిపారు. ఆదే దిశగా వారి యొక్క అనుభవాలను మాకు ఎల్లవేళలా అందచేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయ పెద్దల ఆశీసులతో విశ్వవిద్యాలయ కృషికి నిరంతరం శ్రమిస్తానాని తెలియచేసారు. అదేవిధంగా నూతనంగా Additional Controller of Examination గా నియమితులైన డా కోట.నీలమణికంట మరియు డా సిహెచ్. కిరణ్మయి విశ్వవిద్యాలయ ఉపకులపతికి జి.యం.సుందరవల్లి గారికి, రిజిస్ట్రార్ డా ఎల్.విజయ కృష్ణ రెడ్డి గారికి, రెక్టర్ ఎం. చంద్రయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డా ఉదయ్ శంకర్ అల్లం డా వెంకటరాయిలు మరియు సూపరింటెండెంట్ రామ కృష్ణ కంట్రోలర్ గారిని షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.