తెలుగు వైతాళికుడు..
అక్షరం అనూచానంగా
సాంప్రదాయ శబ్ద ఘోషలలో
వ్యాకరణ బద్ద శృంఖలాలతో
ప్రబందాల్లో బందీ అయిన
కావ్య కన్నికకు స్వేచ్ఛ నిచ్చి
సమాదరించి నవీకరించి
క్రొత్త ఆశల చిగుర్లు తొడిగి
తెలుగు సారస్వత విహంగానికి
విశాలత్వ భావన చూపి
కవిత్వ వికాస ప్రభంజనాన్ని
సమాంతరంగా సహేతుకంగా
క్రొత్త ఒరవడిని ప్రవేశపెట్టిన
తెలుగు వైతాళికుడు.. శ్రీశ్రీ
కవితా వస్తువు భారత్వ అర్హతను
విస్మరించి
సామాన్యుని కి నిత్య పరిచయమై
అనర్హత గా భావించే
ప్రతి వస్తువును స్మరిస్తూ
కవితా పీఠిక పై అధిష్టించి
సమర్చించి సంస్కరించి
అభ్యుదయ కవితా బీజాలతో
బీడు వారిన సామాన్య కవి
హృదయాలలో సేద్యం చేస్తూ
సంచరిస్తూ సంచలిస్తు
తెలుగు భాషా యోషామణి కి
నిత్య నైవేద్యం చేస్తూ
నవతరానికి దారులు వెదికి
నవయుగానికి బాటలు వేసిన
తెలుగు వైతాళికుడు. శ్రీశ్రీ.
(మహా కవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా)
-శేషం శ్రీనివాసా చార్య
Rtd GHM. కరీంనగర్.