దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుదల.. కేంద్రం కీలక నిర్ణయం
![](https://clic2news.com/wp-content/uploads/2021/05/rice.jpg)
ఢిల్లీ (CLiC2N): కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా బియ్యం ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదలచేసింది. బాస్మతియేతర బియ్యం.. పాక్షికంగా, పూర్తిగా మరపట్టిన, పాలిషఫ్ చేయని తెల్లటి బియ్యం ఎగుమతులపై ఈ నిషధం వర్తిస్తుంది. అయితే.. ఇప్పటికే ఎగుమతి చేయడానికి బియ్యాన్ని ఓడలో లోడ్ చేసి ఉంటే అలాంటి ఎగుమతులకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆహార భద్రత అవసరాల కింద ప్రభుత్వం అనుమతించిన దేశాలకు బియ్యం ఎగుమతులను మినహాయించారు.