రాష్ట్రంలో బిసిల‌ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..

మండపేట (CLiC2NEWS): ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బిసిల సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు అన్నారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి పలు పాలసీలను సిఎం తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా శనివారం మండపేట శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిఎం చిత్రపటానికి గీత కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గణేశ్వరరావు మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలలో ఏ ప్రభుత్వం చేయని విధంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి ప్రయోజనాలు చేకూరుస్తుందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో సైతం బీసీలకు పెద్దపీట వేస్తూ 50 శాతానికి పైగా రిజర్వేషన్లను అమలు చేస్తుందన్నారు.

సొసైటీ చైర్మన్ కుక్కల రామారావు మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే చెల్లించే పరిహారాన్ని రూ. ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వం పెంచిందన్నారు. సహజ మరణం చెందితే వైయస్సార్ భీమా పథకం ద్వారా ఐదు లక్షల పరిహారం చెల్లిస్తుందన్నారు. కల్లు కిస్తీలను పూర్తిగా రద్దు చేసిందన్నారు. ఎన్ ఆర్ ఈ జీ ఎస్ షెల్టర్ బెడ్ పథకాల కింద తాటి, ఈత చెట్లు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు పెంకే గంగాధర్, కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్, మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, శెట్టిబలిజ నాయకులు పెంకే వెంకట్రావు, గుత్తుల గోవిందు, యాండ్ర ప్రభాకర్ (బుజ్జి), పంపన శ్రీనివాస్, చొల్లంగి గోవిందు, గెద్దాడ అన్నవరం, వాసంశెట్టి శ్రీనివాస్ (నల్ల శ్రీను), నామాల సత్యనారాయణ, గీత కుక్కల రామకృష్ణ, కుడిపూడి ధనరాజు, కుక్కల ఏడుకొండలు,వాసంశెట్టి శ్రీహరి, చొల్లంగి శ్రీను, పెంకే శ్రీను, కొప్పిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.