ఖైరతాబాద్‌లోని అంజన్న ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్..

హైదరాబాద్ (CLiC2NEWS): గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నగరంలోని ఖైరతాబాద్‌లో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని శుభ్రం చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర ఆలయ పరిసర ప్రదేశాలు శుభ్రం చేశారు.