కామారెడ్డి గడ్డపై గులాబీ జెండా ఎగరాల్సిందే..

కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగరాల్సిందేనని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరై మాట్లాడారు. కెసిఆర్ హయంలో పది సంవత్సరాలు కాలంలో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలోకి వచ్చాయని అదేవిధంగా జిల్లా కేంద్రాలు ఏర్పడ్డాయని, కొత్త కలెక్టరేట్ లు అందుబాటులోకి వచ్చి పరిపాలన సులభతరం అయిందని అన్నారు. ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే కామారెడ్డి లోనిఏ గల్లీలో కూడా ఒక చిన్న పని చేయించలేదని, కామారెడ్డిలో అతను ఇచ్చిన హామీలు ఏది ఒకటి కూడా నెరవేరలేదని అన్నారు. కామారెడ్డి పట్టణం వరదలతో అతలాకుతలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కామారెడ్డికి ఒక్క పైసా అందించలేదని స్వయానా సీఎం వచ్చిన ఏమి ఒరగలేదని అన్నారు. చివరకు పెన్షన్లు కూడా ఇప్పటికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వే అమలవుతున్నాయని కొత్తగా రూపాయి కూడా పెంచింది లేదని, కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటని కావున బిఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని కావున కామారెడ్డి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ముజుబుద్దిన్, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్లు గేరిగంటి లక్ష్మీనారాయణ ముదిరాజ్, కాసర్ల స్వామి, కృష్ణాజి రావు, కుంభాల రవి యాదవ్, అరికెల ప్రభాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపి గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఆఫీజ్, బిఆర్ఎస్ యువజన అధ్యక్షుడు చెలిమెల భాను, పెద్దోళ్ల శశిధర్ రావు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: రూ.3 ల‌క్ష‌లు దాటిన కిలో వెండి..

Leave A Reply

Your email address will not be published.