తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

మండపేట (CLiC2NEWS): గ్రామీణ తపాలా ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని తపాలా ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి వివి రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో తపాలా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 12, 24, 36 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ లు ఇవ్వాలని కోరారు. తమను సివిల్ సర్వెంట్ లుగా గుర్తించాలన్నారు. ముఖ్యంగా డిసెంబరు నెలలో ఒరిస్సాలో జరగబోయే అఖిల భారత తపాల ఉద్యోగుల సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. అక్కడ ఆంధ్ర తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. టార్గెట్ ల పేరుతో గ్రామీణ తపాలా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సహాయ కార్యదర్శి పి భూలోకం, రామచంద్రపురం శాఖ అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు వై స్పర్జన్ రాజు, ఎస్ వి వి మునేశ్వరరావు, వై కామేశ్వరి, రాజమండ్రి అధ్యక్షులు పి శ్రీనివాస్, కోశాధికారి బి రాంబాబు పాల్గొన్నారు.