Mandapeta: కరోనా సమయంలో జమాతె ఇస్లామీ హింద్ సేవలు అభినందనీయం..

మండపేట (CLiC2NEWS): కరోనా సమయంలో జమాతే ఇస్లామి హింద్ మండపేట శాఖ కోవిడ్ రిలీఫ్ వింగ్ సభ్యులు ప్రజలకు అందించిన సేవలు అభినందనీయమని శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు తనయుడు వైఎస్సార్సీపీ యువ నేత తోట పృథ్వీరాజ్ ప్రశంసించారు. జమాత్ కోవిడ్ రిలీఫ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కరోనా వేళ జమాత్ చేసిన సేవ కార్యక్రమాలను ఆయన తెలుసుకుని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దగ్గరి బంధువులు, సొంతవారు సైతం కోవిడ్ తో మరణించిన వారిని తాకడానికి భయపడుతున్న నేపథ్యంలో జమాత్ సభ్యులు ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. జమాత్ ప్రతీ సభ్యుణ్ణి ఈ సందర్భంగా తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని పృథ్వి అన్నారు. ఈ సందర్భంగా జమాత్ స్దానిక ఉపాధ్యక్షులు రిజ్వాన్, డానజీర్, కోవిడ్ కాలంలో జమాత్ చేపట్టిన సేవా కార్యక్రమాలను పృథ్వీరాజ్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జమాత్ సాంఘీక సేవా కార్యదర్శి ఉమర్, సభ్యులు రెహ్మన్, ఐవైయం సభ్యులు అతిఫ్ తదితరులు పాల్గొన్నారు.