మహ్మద్ ప్రవక్త ప్రవక్త బోధనలు అనుసరణీయం: మున్సిపల్ చైర్మన్

మండపేట (CLiC2NEWS): మహనీయ మహ్మద్ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు అనుసరణీయమని మండపేట పురపాలక సంఘ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గ రాణి పేర్కొన్నారు. మహనీయ ముహమ్మద్ ప్రవక్త వారి జయంతి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మండపేట ఆహలే సున్నత్ జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ హజరత్ మహబూబ్ సుభాని జెండా వద్ద గల ఉర్దూ పాఠశాలలో ముస్లిం మహిళల సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జామియా మసీదు ఇమామ్ గులాం ముర్షిద్ రజ్వి మాట్లాడుతూ ముస్లిం మహిళల హక్కు హక్కుల కోసం మహనీయ ముహమ్మద్ ప్రవక్త ఎన్నో ప్రబోధాలు చేశారని పేర్కొన్నారు.
మహనీయ ప్రవక్త జన్మదినాన్ని ఆనందంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. లోకంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థనలు చేశారు. ఈ నెల 19 మంగళవారం మిలాద్ నబి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. చైర్ పర్సన్ రాణి మాట్లాడుతూ అందరి ప్రభువు ఒక్కరేనని కులమతాలకు అతీతంగా సమాజంలో కలిసి మెలిసి జీవనం సాగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కో అప్షన్ సభ్యులు సయ్యద్ రబ్బానీ, మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ రాహిల్ సుల్తానా, ఎండి అన్సారీ, వైఎస్సార్ సిపి నాయకులు యారమాటి వెంకన్నబాబు, చల్లా ప్రసాద్, ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.