రేషన్ వాహనం డ్రైవర్ గుండె పోటుతో మృతి
మండపేట (CLiC2NEWS): పురపాలక సంఘం పరిథిలో రేషన్ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్న దుర్గా ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. పట్టణానికి చెందిన దుర్గా ప్రసాద్ 25, 26 వార్డులకు సంబంధించిన 12వ సచివాలయంలో రేషన్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు. ఇలా ఉండగా మంగళవారం రేషన్ డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు లోనై గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమచారం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి బిక్కిన అమ్మన్న నగర్ లో నివాసముంటున్న మృతుడి నివాసానికి వెళ్ళి పరామర్శించారు. చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న ప్రసాద్ భార్యను ఆమె ఓదార్చారు. బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులకు బాధ పడకండి అని ధైర్యం చెప్పి ఓదార్పు నిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుండి ఆర్థికంగా లబ్ది చేకూర్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.