త‌మిళ‌నాట ఘోర ప్ర‌మాదం.. పాఠ‌శాల వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు

చెన్నై పాఠ‌శాల వ్యాన్‌ను రైలు ఢీకొట్ట‌డంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని క‌డ‌లూర్ స‌మీపంలో చోటుచేసుకుంది. క‌డ‌లూర్‌లోని ప్రైవేటు పాఠ‌శాల వ్యాన్ ఉద‌యం 7.45 గంట‌ల‌కు న‌లుగురు విద్యార్థుల‌తో బ‌య‌లుదేరింది. క‌డ‌లూర్ స‌మీప చెమ్మ‌గుప్పం ప్రాంతంలో రైల్వే గేటు దాటుతుండ‌గా పాసింజ‌ర్ రైలు ఢీకొట్టింది. విళుపురం-మైలాడుదురై ప్రాసింజ‌ర్ రైలు.. పాఠ‌శాల వ్యాన్‌ను ఢీకొట్టి, 50 మీట‌ర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో విద్యార్ధి , డ్రైవ‌ర్ చికిత్స పొందుతున్నారు. మ‌ర‌ణించిన వారిలో ఇద్ద‌రు ఒకే కుటుంబంలోని అక్కా..త‌మ్మ‌డు ఉన్నారు. వీరిరువురు ప్రాణాలు కోల్పోవ‌డంతో త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

రైలు వ‌స్తున్న‌క్ర‌మంలో గేటు వేయ‌క‌పోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్ఉల రైల్వే అధికారులు తెలిపారు. గేట్ కీప‌ర్ను స‌స్సెండ్ చేశారు. ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లిన స్థానికుడు విద్యుత్ తీగ త‌గిలి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

Leave A Reply

Your email address will not be published.