కాకినాడ జిల్లాలో టిఎస్ఆర్టిసి బస్సు బోల్తా..

కాకినాడ (CLiC2NEWS): జిల్లాలో కత్తిపూడి హైవేపై బస్సు బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విశాఖపట్నం నుండి భద్రాచలం వెళ్తున్న టిఎస్ ఆర్టిసి బస్సు కత్తిపూడి హైవేపై బోల్తాపడింది. డ్రైవర్‌కు బిపి డౌన్ కావడంతో బస్సుపై నియంత్రణ కోల్పాయారు. దీంతో బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు స్వల్పంగా ఆయపడ్డారు. వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికత్సనందించారు.