నార‌గ్ క‌ర్పూల్‌లో రెండు కార్లు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం

ఉప్పునూత‌ల (CLiC2NEWS): నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని ఉప్పునూతల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. వెల్టూర్‌ గేట్‌ వద్ద రెండు వాహ‌నాలు ఎదురెదురుగా వచ్చి బ‌లంగా ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదం వెల్టూర్‌ గేట్‌ వద్ద శ్రీశైలం – హైదరాబాద్‌ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను అచ్చంపేట ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విష‌యంగా ఉన్న క్ష‌త‌గాత్రులు ఇద్ద‌రిని హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. కాగా బాధితుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.