ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ..
హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ధాన్యం సేకరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. అలాగే ఒమిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ తెలంగాణలో ప్రవేశించకుండా అడ్డుకునే చర్యలపై, దాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలన్నింటినీ సిద్ధంచేసే ప్రణాళికపై ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనలు చేయనున్నట్లు తెలుస్తున్నది.