రెండు రోజులు తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌!

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఇవాళ‌, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ శ‌నివారం హెచ్చ‌రించింది. ఈ రెండు రోజుల పాటు రాష్ట్రంలోని ప‌లు చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు తెలిపారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇవాళ మ‌ధ్యాహ్నం నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించిన నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌తో పాటు ఇత‌రులు స‌హాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను సంప్ర‌దించొచ్చు అని విజ్ఞ‌ప్తి చేశారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం ఫోన్ నంబ‌ర్ – 040 2111 1111. వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.