AP Police: జాతీయ స్థాయిలో మొద‌టి స్థానం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో నిర్వ‌హించిన పోటీల‌లో మొద‌టి స్థానం దక్కించుకుంది. హరియాణాలో నిర్వ‌హించిన జాతీయ భ‌ద్ర‌తా ద‌ళ విభాగం (SNG ) ‘అగ్ని ప‌రీక్ష -7’ పేరుతో ఉగ్ర‌వాద నిరోధ‌క ఆప‌రేష‌న్లు, వివిధ ఆయుధాల‌తో ఫైరింగ్‌, మార‌థాన్ ర‌న్నింగ్‌, శారీర‌క ధారుడ్య పోటీలు నిర్వ‌హించారు. ఎనిమిది రాష్ట్రాల‌కు చెందిన బృందాలు పాల్గొన‌గా ఎపికి చెందిన ఆక్టోప‌స్ బృందం ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా ఉత్త‌మ జ‌ట్టుగా నిలిచింది. హెడ్ కానిస్టేబుల్ పాపారావు ఉత్త‌మ ఆల్ రౌండ‌ర్‌గా ఎంపిక‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.