వాల్మీకి బోయ‌ల‌ను ఎస్‌టి జాబితాలో చేరుస్తాం.. సిఎం కెసిఆర్‌

అలంపూర్ (CLiC2NEWS): గ‌తంలో పాల‌మూరు నుండి అధికంగా వ‌ల‌స‌లు ఉండేవ‌ని, ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిస్థితులు ప్ర‌జ‌లు గుర్తించాలని బిఆర్ ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సిఎం కెసిఆర్ ప్ర‌తి రోజూ బిఆర్ ఎస్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఆదివారం జోగులాంబ గ‌ద్వాల జిల్లా, అలంపూర్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

వాల్మీకి బోయ‌ల‌ను బిసిల్లో క‌లిపిన‌ది కాంగ్రెస్ పార్టీయేన‌ని, బిఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే వాల్మీకి, బోయ‌ల‌ను ఎస్‌టి జాబితాలో చేరుస్తామ‌న్నారు. ఇందిర‌మ్మ రాజ్యం తెస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నార‌ని, అపుడు ఆక‌లి బ‌తుల‌కు త‌ప్ప ఇంకేం ఉండ‌దన్నారు. వారు చేసిన అన్యాయాల‌ను స‌రిదిద్దుకొస్తున్నామన్నారు. ఆర్డిఎస్ నుండి నీళ్లు త‌ర‌లించినా.. వారు ఎవ‌రూ మాట్లాడ‌లేద‌ని, వారికి ప‌దవుల మీద ఆశ మాత్ర‌మే ఉంద‌న్నారు. ఆర్డిఎస్ కాలువ్లో పూడిక‌తీత ప‌రుల‌కు రూ. 13 కోట్లు మంజూరు చేశామ‌న్నారు. పాల‌మూరులో క‌రవు రాకుండా చూసేబాధ్య‌త నాదని సిఎం క‌సిఆర్ హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.