Mandapeta: 2వ వైస్ చైర్మన్ గా `వేగుళ్ల` ఏకగ్రీవం

మండపేట (CLiC2NEWS): మున్సిపల్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర లేపిన రాష్ట్రప్రభుత్వం రెండవ వైస్ చైర్మన్ ల పదవులు తీసుకొచ్చింది. అందులో భాగంగా మండపేట మున్సిపాలిటీ రెండవ వైస్ చైర్మన్ గా 19వ వార్డ్ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ వేగుళ్ళ నారాయణరావు నారాయణరావు (నారయ్యబాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి మెప్మా పీడీ కే శ్రీరమణి శుక్రవారం కౌన్సిల్ హాల్ లో ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు 29 మంది కౌన్సిల్ సభ్యులు హాజరు కాగా అందులో అధికార పార్టీ వైఎస్సార్సీపీ సభ్యులు 21 మంది హాజరయ్యారు. వారిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆరుగురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఎన్నికకు హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఎన్నికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలలో వేగుళ్ళ నారయ్యబాబును 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ ప్రతిపాదించగా ఒకటవ వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్, కౌన్సిల్ విప్ పోతంశెట్టి వరప్రసాద్ ఆయనను బలపరిచారు. దీనికి మిగిలిన సభ్యులు అంతా ఆమోదం తెలిపారు. దాంతో వేగుళ్ళ నారాయణరావును రెండవ వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి శ్రీరమణి ప్రకటించారు. రెండవ వైస్ చైర్మన్ గా నారయ్యబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైస్ చైర్మన్ గా ఎన్నికైన నారయ్యబాబుకు ఎన్నికల అధికారిణి శ్రీరమణి దృవీకరణ పత్రాన్ని అందజేశారు.
నారయ్యబాబుకు అభినందనలు..
రెండవ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారయ్యబాబుకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ కౌన్సిలర్లు పూలమాలలు వేసి దుస్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి ఆధ్వర్యంలో అధికార సభ్యులంతా నూతంగా ఎన్నికైన వేగుళ్ల నారాయణరావును ఘనంగా సత్కరించారు. అలాగే నారయ్యబాబు నూతన వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడంతో ఆయన బంధు మిత్రులంతా కౌన్సిల్ హాలు లోకి విచ్చేసి అభినందించారు. యువ పారిశ్రామిక వేత్త వేగుళ్ల చైతన్య బాబు, వల్లూరి మనోజ్, వైసీపీ సీనియర్ నాయకుడు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి తనయుడు ఆర్యన్ ,వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజబాబు), నాయకులు కొమ్ము రాంబాబు, పతివాడ రమణ, రామిశెట్టి శ్రీహరి, ముక్కా సుబ్రహ్మణ్యం, ముక్కా దాలయ్య, వేగుళ్ల నారయ్య చౌదరి (బాబి), వేగుళ్ల చినబాబు, బొల్లంరెడ్డి, అబ్భు, కొప్పాక అబ్బు, రమేష్, ముత్యాల అమ్మిరాజు, బొల్లంరెడ్డి సత్యనారాయణ, కారుకొండ వీరబాబు, వేగుళ్ళ మురళీకృష్ణ, పెనుమర్తి అర్జున్, యనమాల కొండ, జి వి కే సత్యనారాయణ వంక వీర్రాజు ఇంకా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమలో టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్, వైఎస్సార్ నాయకులు శెట్టి నాగేశ్వరరావు, జొన్నపల్లి సత్తిబాబు, కోళ్ల శ్రీను, వీరబాబు, మొండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.