వెంకటేష్- త్రివిక్రమ్ సినిమా టైటిల్.. `ఆదర్శ కుటుంబం`
హైదరాబాద్ (): విక్టరీ వెంకటేశ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడుగా రూపొందుతున్న సినిమాకు ఎట్టకేలకు టైటిల్ ఖరారైంది. ఈ మేరకు మేకర్స్ టైటిల్‌ను ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకి `ఆదర్శకుటుంబం` అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమాకి `హౌస్ నం. 47 (ఎకె 47)` అనే ట్యాగ్‌లైన్ ను కూడా పెట్టారు.
ఈ క్రేజి ప్రాజెక్టు కు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో టైటిల్స్ చెక్కర్లు కొట్టాయి. వాటన్నింటికి చెక్ చెబుతూ నిర్మాణ సంస్థ ఈ రోజు టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది.
టైటిల్‌తో పాటు వెంకటేష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. అలాగే రెగ్యూలర్ షూటింగ్ మొదలైనట్లు కూడా తెలిపారు. ఈ పోస్టర్‌లో వెంకటేస్ ఒక చేతిలో ఓ బ్యాగ్‌తో , మరో చేతిలో హాయ్ చెబుతున్నట్లుగా ఉన్న పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేష్ లైట్ కలర్ కాస్ట్యూమ్స్‌తో మధ్యతరగతి వ్యక్తిలా అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
2025 లో `సంక్రాతికి వస్తున్నాం` సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన వెంకటేశ్.. 2026 సంక్రాంతికి చిరంజీవి-అనీల్ రాపూడి కాంబోలో వస్తున్న `మన శంకర వరప్రసాద్`లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు `దృశ్యం-3` ప్రాజెక్టు కూడా చేస్తున్నారు.
The title. The vibe.
The excitement. ALL LOADED! 🤩Presenting the Title & First Look of
“𝐀𝐚𝐝𝐚𝐫𝐬𝐡𝐚 𝐊𝐮𝐭𝐮𝐦𝐛𝐚𝐦 𝐇𝐨𝐮𝐬𝐞 𝐍𝐨: 𝟒𝟕 – 𝐀𝐊 𝟒𝟕” 🏠🔥#AK47 | #AadarshaKutumbam | #Venky77 | #VenkateshXTrivikramShoot kicks off today… arriving BIG this Summer… pic.twitter.com/ZmWnumxnoP
— Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2025
Alsor Read: పదో తరగతి అర్హతతో 25,487 కానిస్టేబుల్ పోస్టులు