ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 25,487 కానిస్టేబుల్ పోస్టులు

 

కేంద్ర సాయుధ ద‌ళాల్లో 25వేల‌కు పైగా కానిస్టేబుల్ జ‌న‌ర‌ల్ డ్యూటి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC)ద్వారా భ‌ర్తీ చేస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ దేహ‌దారుఢ్య , శారీర‌క ప్ర‌మాణ ప‌రీక్ష‌, ఆరోగ్య ప‌రీక్ష‌ల ద్వారా ఎంపిక జ‌రుగుతుంది. మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మ‌హిళ‌ల‌కు 2,020 పోస్టులు క‌ల‌వు. ఎంపికైన వారు మొద‌టి నెల నుండే రూ.40 వేల జీతం తీసుకోవ‌చ్చు. విధుల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారు ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవ‌చ్చు.

అభ్య‌ర్థుల వ‌య‌స్సు జ‌న‌వరి 1, 2026 నాటికి 18 నుండి 23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 2.1.2003 నుండి 1.1.2008 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు. ఎస్‌సి , ఎస్‌టిల‌కు ఐదేళ్లు, ఒబిసిల‌కు మూడేళ్లు వ‌య‌స్సు స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.100. మ‌హిళ‌ల‌కు. ఎస్‌సి, ఎస్‌టిల‌కు ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తులు పంపేందుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 31.

ఫిబ్ర‌వరి-ఏప్రిల్ మ‌ధ్య ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌లు తెలుగులో కూడా రాసుకోవ‌చ్చు.

ప‌రీక్ష విధానం : ఆన్‌లైన్‌లో 160 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. మొత్తం 80 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 2 మార్కులు

జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్ – 20ప్ర‌శ్నలు
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ – 20 ప్ర‌శ్న‌లు
ఎలిమెంట‌రీ మ్యాథ‌మెటిక్స్ – 20 ప్ర‌శ్న‌లు
ఇంగ్లిష్‌/ హిందీ నుండి 20 ప్ర‌శ్న‌లు అడుగుతారు.

ప‌దో త‌ర‌గ‌తి సిల‌బ‌స్ స్తాయిలోనే ప్ర‌శ్న‌లు ఉంటాయి.

ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి పావు మార్కు త‌గ్గిస్తారు.

ప‌రీక్ష‌లో అర్హ‌త కోసం జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు 30%, ఒబిసి , ఇడ‌బ్ల్యుఎస్‌లు 25%, ఎస్‌సి, ఎస్‌టిలు 20 % మార్కులు పొందాల్సి ఉంటుంది.

ఎన్‌సిసి సి స‌ర్టిఫికెట్ ఉంటే 5, బి స‌ర్టిపికెట్ ఉంటే 3%, ఎ స‌ర్టిఫికెట్ ఉన్న వారికి 2% మార్కులు క‌లుపుతారు.

అనంత‌రం పిఇటి, పిఎస్‌టి టెస్ట్‌:

పిఇటిలో పురుషులు 5 కిలో మీట‌ర్ల దూరాన్ని 24 నిమిషాల్లో .. మ‌హిళ‌లు 1.6 కిలో మీట‌ర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో చేరుకోవాలి.

పిఎస్‌టిలో పురుషులు 170, మ‌హిళ‌లు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.

ప‌రీక్ష‌ల్లో సాధించిన మార్కులు, రాష్ట్రాలు, విభాగాల వారీ ఖాళీలు, రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం ఎంపిక జ‌రుగుతుంది. శిక్ష‌ణ అనంత‌రం విధుల్లోకి తీసుకుంటారు.

బోర్డ‌ర్ సెక్యూరిటి ఫోర్స్‌ (BSF)

సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటి ఫోర్స్ (CISF)

సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్‌(CRPF)

స‌శ‌స్త్ర సీమా బ‌ల్ (SSB),

ఇంటో టిబెట‌న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌(ITBPF)

సెక్ర‌టేరియ‌ట్ సెక్యూరిటి ఫోర్స్(SSF)

అస్సాం రైఫిల్స్(AR)

అభ్య‌ర్థుల ఆస‌క్తి ప్ర‌కారం వీటిలో ఏదైనా ఎంచుకోవ‌చ్చు.

Job News: ఇసిఐఎల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.