తరవాణిపేటలో విద్యా గణపతి పూజకు హాజ‌రైన ఎమ్మెల్యే వేగుళ్ల‌

వినాయ‌కుని మండ‌పంలో విద్యా గ‌ణ‌ప‌తి పూజ

మండపేట: (CLiC2NEWS): పట్టణంలోని 4వ వార్డు తరవాణిపేటలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు  వైభవంగా నిర్వ‌హిస్తున్నారు.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విద్యా గణపతి పూజలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి హాజర‌య్యారు. చిన్నారులకు పూజకు కావాల్సిన పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. చిన్నారులకు సాంప్రదాయం పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి సంవత్సరం విద్యాగణపతి పూజ నిర్వహిస్తున్నామ‌ని క‌మిటి స‌భ్యులు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తామ‌ని , భక్తులందరూ పాల్గొనాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ
చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ గుండు రామతులసి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మచ్చానాగు, ఆలయ కమిటీ సభ్యులు గుండు వీర తాతరాజు,  గ్రంధి బుల్లిబాబు, జాయన సాయి సత్యనారాయణ, మోహనరావు, పొలమూరి శ్రీనివాస్,  పాలమూరు త్రినాథ్, కోడూరి నాగరాజు, ఆరేటి మహేష్, బొల్లంరెడ్డి స్వామి, రెడ్డి రవిరాజు, కే రామకృష్ణ, ఏ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.