మాట్లాడేందుకు 2 గంటల సమయం కావాలి: హరీశ్‌రావు
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చ కొనసాగుతోంది. ఈ నివేదికను ప్రభుత్వం ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో అందజేసింది. ఈ సందర్భంగా మాజి మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 660 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడాలంటే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడేందుకు తనకు రెండు గంటల సమయం కావాలన్నారు. ఆదివారం రోజు సభలో నివేదిక పెట్టారంటేనే వారి ఉద్దేశం అర్దమవుతోందన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ దర్యాప్తు నిష్పక్షపాక్షికంగా జరిగిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కమిషన్ నివేదికపై రేపు, ఎల్లుండి కూడా మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్సెండ్ చేయాలి: హరీశ్‌రావు పిటిషన్
[…] మాట్లాడేందుకు 2 గంటల సమయం కావాలి: హ… […]