ఎన్నికల్లో పోటీపై టివికె పార్టీ కీలక నిర్ణయం
చెన్నై (CLiC2NEWS): వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం పార్టి శుక్రవారం చెన్నైలో ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో పార్టీ సిఎం అభ్యర్థిగా టివికె వ్యవస్థాపకుడు, సినీ హీరో విజయ్ను ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానం చేశారు. వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసబలు నిర్వహించాలని పార్టి ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్దాంతాలు విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది.
వచ్చే ఏడాదిలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో టివికె పార్టి సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించింది. ఈ సందర్భంగా పార్లీ వ్యవస్థాపకుడు విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటు వాదులతో పొత్తు ఉండదని .. బిజెపి విభజన రాజకీయాలు చేస్తోందన్నారు. బిజెపి విద్యేష రాజకీయాలు తమిళనాడులో చెల్లవని విజయ్ అన్నారు. ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు దురుద్దేశ పూరితమైనవని.. ఆయన వ్యాఖ్యలు తమిళనాడు ద్విభాషా విధానంపై ప్రత్యక్ష దాడి అని పార్టి అభివర్ణించింది. తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషల్ని రుద్దడాన్ని తమ పార్టీ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టం చేసింద.