ఉలవపాడు: ఇండోసోల్ కంపెనీకి పంట భూములివ్వం..
నెల్లూరు (CLiC2NEWS): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంటలు పండే భూములను కంపెనీల కోసం ఇవ్వమని అభ్యంతరం తెలుపుతున్నారు. కరేడ్‌లో ఇండోసోల్ సోలార్ కంపెనీ ఏర్పాటకు రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో రైతులు.. అధికారులు తిరిగి వెళ్లిపోవానలి నినాదాలు చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇండోసోల్ సోలార్ కంపెనీ ఏర్పాటుకు 4,500 ఎకరాల భూసేకరణకు గ్రామంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. రైతులు ఆందోళన తెలుపడంతో పోలీసులు మోహరించారు.