విజయ్ దేవ‌ర‌కొండ‌ ‘కింగ్డ‌మ్’ ట్రైల‌ర్ రిలీజ్‌..

Kingdom: గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం ‘కింగ్డ‌మ్‌’. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో స‌త్వ‌దేవ్ కీల‌క పాత్ర పోషించారు. భాగ్య‌శ్రీ బోర్సే క‌థానాయిక‌. ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. తిరుప‌తిలో ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త‌గా క‌నిపించ‌నున్నారు.

తిరుప‌తిలో నిర్వ‌హించ‌న ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విజ‌య్ మాట్లాడారు. తిరుప‌తి వేంక‌టేస్వ‌ర స్వామి క‌రుణిస్తే.. టాప్‌లోకి వ‌చ్చేస్తాన‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కింగ్డ‌మ్ తో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాను చూపిస్తామ‌ని నిర్మాత నాగ‌వంశీ చెప్పారు. ఇంత‌కు ముందు ఎపుడూ చూడ‌ని విజ‌య్‌ని ఈసినిమాలో చ‌పిస్తున్నామ‌న్నారు. ఎక్కువ మంది థియేట‌ర్‌కు వ‌చ్చి సినిమా చూడాల‌ని ఈ సంద‌ర్భంగా నాగ‌వంశీ ప్రేక్ష‌కుల‌ను కోరారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మించారు.

https://youtu.be/xqdXSA8hNI4?si=KRTktTkLTB9x-fmJ

Leave A Reply

Your email address will not be published.