వి ఎస్ యూలో సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ 132వ జయంతి వేడుకలు

నెల్లూరు (CLiC2NEWS): విక్ర‌మ సింహ‌పురి విశ్వవిద్యాలయంలో సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఆచార్య సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ 132వ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. విశ్వవిద్యాలయ ప్రాగణంలోని శ్రీ పొట్టి శ్రీరాముల భవనంలోని స్టాటిస్టిక్స్ విభాగంలో సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ చిత్రపటానికి ఉపకులపతి ఆచార్య జియం. సుందరవల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి సుందరవల్లి మాట్లాడుతూ.. గణిత శాస్త్రజ్ఞుడు, గణాంకవేత్త, జన్యు శాస్త్రవేత్త మరియు విద్యావేత్తగా చురుకుగా పనిచేసిన బ్రిటీష్ పాలిమత్ మరియు జీవశాస్త్రవేత్త. గణాంకాలలో అతని పనికి,అతను “ఆధునిక గణాంక శాస్త్రానికి పునాదులను దాదాపు ఒంటరిగా సృష్టించిన మేధావి” మరియు “20వ శతాబ్దపు గణాంకాలలో అతి ముఖ్యమైన వ్యక్తి” అని వర్ణించబడ్డాడు.

ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం .చంద్రయ్య, రిజిస్ట్రార్ డా ఎల్ విజయ కృష్ణా రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సుజా ఎస్ నాయర్, స్టాటిస్టిక్స్ విభాగ అధిపతి డా టి.వీరా రెడ్డి,డా సిహెచ్. విజయ, ఆర్ వి ఎస్ ఎస్ నాగభూషణ రావు, మరియు ప్రసూన, తస్లీమా,అహ్మద్ బాష విద్యార్థిని విద్యార్థులు మరియు బోధన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.