VSU Nellore: కొండయపాలెం నగరపాలక ప్రాధమిక పాఠశాలలో ప‌ల్స్ పోలియో

నెల్లూరు (CLiC2NEWS): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నేడు(ఆదివారం) జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కొండయపాలెం నగరపాలక ప్రాధమిక పాఠశాలలో పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) కోఆర్డినేటర్ డా. ఉదయ్ శంకర్ అల్లం మాట్లాడుతూ ఐదేళ్ళలోపు పిల్లలకు తప్పక పోలియో చుక్క‌లు వేయించండి అన్నారు. పొలియోను తరిమి కొట్టండి. నిండు జీవితానికి రెండు చుక్కలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ సిబ్బంది ఉస్మాన్ అలీ మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.