అవరోధాలు ఎదురైనా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా: ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు నేరెళ్ల
మండపేట (CLiC2NEWS): అవరోధాలు ఎన్ని ఎదురైనా తాను చేసే సేవాకార్యక్రమాన్ని యథావిధిగా ఉన్న చోటే కొనసాగిస్తానని డొక్కా సీతమ్మ నిత్యాన్నదానం ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు నేరెళ్ళ పైడిరాజు స్పష్టంచేశారు. నాలుగు రోజుల క్రితం ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద తాత్కాలిక షెడ్డు నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగించిన విషయం విధితమే. ఆ మర్నాడు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండపేట విచ్చేసి పైడిరాజును పరామర్శించి తొలగించిన షెడ్డును పరిశీలించారు. జరిగిన పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హర్షకుమార్ వెంటనే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ తోను, చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణిని కలిసి సంప్రదింపులు జరిపారు. వారి సమాధానాలు విన్న మాజీ ఎంపీ హర్షకుమార్ సంస్ధకు పట్టణ పరిధిలో ఏదో ఒకచోట పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
అంతవరకూ గతంలో మాదిరిగానే పాత స్థలంలోనే యథావిధిగా అన్నదానం నిర్వహించమని ఆయన పైడిరాజుకు సూచించారు. హర్షకుమార్ భరోసా కల్పించి పైడిరాజుకు అండగా ఉంటానని ధైర్యం చెప్పడంతో అన్నదానాన్ని తిరిగి ప్రారంభించారు. పైడిరాజు మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు అన్నం పెట్టాలనే ఆశయంతో తాను సంస్ధను నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. ఇందులో తాను ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా అనాథలకు సేవచేస్తుంటే కొందరు ఓర్వలేక సంస్థను నిర్వీర్యం చేయాలని కుట్రలు పన్నారని చెప్పారు. ఎన్ని కుయుక్తులు వేసినా అన్నదానం కార్యక్రమాన్ని అక్కడి నుండి కదిపే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
I’ve read a few just right stuff here. Definitely price bookmarking for revisiting.
I surprise how so much attempt you put to create any such fantastic informative site.
Remarkable things here. I’m very satisfied to see your
article. Thank you a lot and I’m taking a look forward to contact
you. Will you kindly drop me a mail?
Excellent post. I am facing many of these issues as well..